ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
108 ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. సంఘం జిల్లా మహాసభ శుక్రవారం పేపర్‌మిల్లు వద్ద గల సిఐటియు కార్యాలయంలో శ్రీనివాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా బి.రాజులోవ, గౌరవ సలహాదారుగా ఎంఎన్.శ్రీనివాసు, అధ్యక్షులుగా ఇఎన్‌వి.రమణ, జనరల్ సెక్రటరీగా గుజ్జుల రమేష్‌బాబు, కోశాధికారిగా జె.వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జొన్నకూటి నానాజీ, ఉపాధ్యక్షులుగా లోహి నాగరాజు, వి.దుర్గా ప్రసాద్, సహాయ కార్యదర్శిగా డి.ఆనంద్, ఐ.రమేష్‌నాయుడు, కమిటీ సభ్యులుగా జె.క్రాంతి, డి.సుధాకర్, మహిళా అధ్యక్షులుగా ఎన్.సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, 108ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎంఎస్.శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు 108 ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వేతనాలు పెంచాలని, ప్రభుత్వ కాంట్రాక్ట్ పద్దతిలోకి మార్చాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.










