రూ.91లక్ష మేర ఆర్థిక సాయం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద జిల్లాలో తొలి విడతగా 108 మంది లబ్ధిదారులకు రూ.91లక్షల మేర ఆర్థిక సాయం అందించామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. బటన్ నొక్కి 4,536 జంటల ఖాతాల్లో రూ.38.18 కోట్ల నగదు జమ చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జెసి ఎన్.తేజ్‌భరత్, అధికారులు, లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద జిల్లాలో 108 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ పథకాన్ని అందిస్తున్నామన్నారు. జిల్లాలో63 మంది ఎస్‌సిలు, నలుగురు ఎస్‌సి కులాంతర వివాహం చేసుకున్నవారికి, 33 మంది బిసిలకు, ఐదుగురు బిసి కులాంతర వివాహాలు చేసుకున్నవారికి, ముగ్గురు మైనార్టీ వర్గాలకు చెందిన వారికి మొత్తంగా 108 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందన్నారు.
గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని అర్హత ఉన్నవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సంవత్సరంలో ప్రతి మూడు మాసాలకు ఒక సారి అర్హులైన వారు సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.లక్ష, ఎస్‌సి, ఎస్‌టిలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బిసిలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, వికలాంగులకు రూ.1.50 లక్షలు, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నామన్నారు.
పెళ్లి అయిన 60 రోజుల్లోపు ష్ట్ర్‌్‌జూ://స్త్రరషర-అbఎ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హుల జాబితాను ప్రకటిస్తారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివాహ సమయంలో వరుడుకి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు వయస్సు నిండి, వధూవరులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉందన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ ఎస్.సుభాషిణి, డిఎల్‌డిఒలు పి.వీణాదేవి, వి.శాంతమణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










