May 10,2023 23:52

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం తమ సమస్యలు పరిష్కరించాలని ఎపి 104 ఎంఎంయు ఎంప్లార్సు యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బి.రాజులోవ, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి మూల సింహాద్రి నాయుడు మాట్లాడారు. 104లో డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, వేతనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు 104 ఉద్యోగులను ఆప్కాస్‌లో చేరుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు పూర్తవుతున్న నేటికీ ఆప్కాస్‌లో చేర్చలేదన్నారు. వేతనాలు పెంచాలని, పిఎఫ్‌ యాజమాన్యమే రెండు వైపులా కట్టాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రెల కాంతారావు, సుమలత, ట్రెజరర్‌ అజామ్‌, జిల్లా కమిటీ సభ్యుడు బివిఎస్‌.మల్లికార్జున్‌, రాంబాబు, కాంతారావు, శివబాబు, సిహెచ్‌.అప్పారావు, కిషోర్‌, నాగబాబు, శ్రవణ్‌, పాల్గొన్నారు.