ప్రజాశక్తి-కడియం : మండలంలోని మురమండ గ్రామ పంచాయతీ పరిధిలోని దొరగారి తోట కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పల్లా రమణమ్మకు చెందిన తాటాకిళ్లు పూర్తిగా కాలి దగ్ధమయ్యిoది. దీనితో రమణమ్మ సర్వం కోల్పోయి నిరాశ్రయురాలయ్యింది. వ్యవసాయ కూలీగా జీవిస్తున్న రమణమ్మ యధావిధిగా ఉదయం పనికి వెళ్ళింది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రమణమ్మ ఇంటి నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో ఇరుగుపొరుగు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మండపేట అగ్నిమాపక శాఖ అధికారి జె.హనుమంతురావు తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. వీఆర్వోలు అయినవల్లి బుజ్జి, వేమగిరి సురేష్, వార్డు మెంబర్లు కొసిరెడ్ఢి నూకరత్నం, సుబ్రహ్మణ్యం, యర్రంశెట్టి వీరబాబు, వాసం శ్రీనివాస్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలును పరామర్శించారు.










