రాయచోటి టౌన్ : క్రీడలకు వైసిపి ప్రభుత్వం ప్రత్యేక ప్రాముఖ్యతను కల్పించిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో బుధవారం అబుసిద్దిక్ ట్రావెల్స్ స్పాన్సర్షిప్‌తో, వైసిపి మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలను స్థానిక మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకులు పల్లపు రమేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. వీరికి స్థానిక వైసిపి నాయకులు, యువత ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడా మైదానంలో క్రీడా కారులతో ముచ్చటించారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా బంతిని వేయగా ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి క్రీడాకారులును ఉత్సాహ పరిచారు.ఎమ్మెల్యే టాస్ వేసి క్రీడా కారులకు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా అయానాక్ మాట్లాడుతూ యువతలలో క్రీడా నైపుణ్యం నింపేందుకు అబుసిద్దిక్ ట్రావెల్స్ వారి సహకారంతో బేపారి మహమ్మద్ ఖాన్ క్రికెట్ పోటీలను నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. క్రీడలలో ఓటమి గెలుపులు సహజమేనని, ప్రతి క్రీడా కారునిలో క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. విజేతలకు మొదట బహుమతిగా రూ.50 వేలు, రెండవ బహుమతిగా రూ.30 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఫయాజ్ అహమ్మద్, సాదక్ అలీ, షబ్బీర్, సుగవాసి శ్యామ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ సభ్యులు జాకీర్, నవరంగ్ నిస్సార్, కొలిమి ఛాన్ బాష, ఫయాజ్, రౌనక్,జిన్నా షరీఫ్, కో-ఆప్షన్ సభ్యులు ఖాదరవల్లి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జాఫర్, మాజీ జడ్‌పిటిసి హసన్‌బాష, ఆర్ట్స్ శంకర్, మూస, షకీల్, కొత్తపల్లి ఇంతియాజ్, విక్కీ, అజ్మత్, పైరోజ్ ఖాన్, బేపారి జబివుళ్ళా ఖాన్, అసద్ ఖాన్, ఖైజర్, రఫీ పాల్గొన్నారు.










