Jan 18,2023 23:07

పోటీలను ప్రారంభిస్తున్న సవితమ్మ

ప్రజాశక్తి - పెనుకొండ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా సవితమ్మ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించేందుకే ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు నెలరోజుల పాటు నిర్వహించే ఈ టోర్నీలో 50 టీములు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతకు రూ 50, 116, రన్నర్‌కు రూ.30, 116 నగదు బహుమతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, గుట్టూరు సూర్యనారాయణ, శ్రీరాములు, వెంకటరమణ, నిరుగంటి చంద్ర, గిరి, గోపాల్‌, బాబుల్‌ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.