మాట్లాడుతున్న ఎంప్లాయిమెంట్ అధికారి
యువత ఆలోచన పారిశ్రామిక రంగం వైపు
నెల్లూరు:యువత పారిశ్రామిక రంగం వైపు ఆలోచించాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత నిరాశ నిస్ప్రహలకు లోనుకాకుండా ఉద్యోగాలపై ఆశపడకుండా స్వయం ఉపాధి రంగంలో ముందుకు పోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగంచేసుకోవాలని సూచించారు .ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకదని కానీ ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తగా మారే అవకాశం ఉందన్నారు. సెట్నల్ సీఈవో పుల్లయ్య మాట్లాడుతూ యువజన సంఘాలు స్థాపించుకోవాలని యువత అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కోరారు. క్రీడాకారులకు తమ సహకారము అందిస్తామన్నారు.ప్రముఖ మోటివేటర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ యువతకు నాయకత్వ లక్షణాలను సవివరంగా వివరించారు . నెహ్రూ యువకేంద్రం జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సాహితీ సాంస్కతిక కార్యక్రమాలు క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు విజ్ఞాన సదస్సు లు నిర్వహిస్తున్నామని గ్రామస్థాయి నుంచి యువతలో చైతన్యం కలిగించేందుకు తమ సంస్థ కషి చేస్తుందన్నారు. మూడు రోజులు జరిగే కార్యక్రమాల్లో యువతీ యువకులు విరివిగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.










