ఫొటో : కరపత్రాలు పంచుతున్న జనసేన నాయకులు
'యువశక్తి' జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 12వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. అందులో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పంటవీధి, తోటవీధి ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేశారు. నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, ఆనంద్, భాను, మల్లికార్జున, వెంకట రమణయ్య, మణి, హజరత్, తదితరులు పాల్గొన్నారు.










