ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : త్వరలో ధర్మవరంలో అడుగుపెట్టనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచేలా విజయవంతం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌ఛార్జి చింతలపల్లి మహేష్‌చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో 40 వార్డుల టీడీపీ నాయకులు, కార్యకరలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 1వతేదీ శనివారం ఉదయం 9 గంటలకు ప్యాధిండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం వరకూ కొనసాగుతుందన్నారు. తిరిగి అదేరోజు మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై ధర్మవరం పట్టణం దాటి మార్కెట్ యార్డు సమీపంలో బస ఉంటుందన్నారు. 2న తిరిగి పాదయాత్ర ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ ఉంటుందన్నారు. కాగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసిపి పని అయిపోయిందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసిపిని వ్యతిరేకిస్తున్నారన్నారు. 2024లో టిడిపి ఘన విజయం సాధించక తప్పదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఫణికుమార్, నాగూర్‌హుస్సేన్, పురుషోత్తంగౌడ్, చింతపులుసు పెదన్న, పోతుకుంట లక్కన్న, మేకల రామాంజినేయులు రాళ్లపల్లి షరీఫ్, అంబటి సనత్, పరిశే సుధాకర్, విజయసారధి, చిగిచెర్ల రాఘవరెడ్డి, కేశగాళ్ల శీన, బీబీ, బొట్టు కిష్ట , మాదన సుబ్బయ్య, మున్నీ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గోరంట్ల మండలం చిన్న రాయినపల్లికి చేరింది. ఈ సందర్భంగా మడకశిర నుండి వాహనాలతో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న నారా లోకేష్‌ను కలిశారు. ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడకశిర నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రొద్దం : నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సోమవారం గోరంట్ల మండలంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి రొద్దం మండల నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, చిన్నప్పయ్య, రొద్దం నరసింహులు, మాధవనాయుడు, జివిపి నాయుడు, టైలర్ ఆంజనేయులు, చంద్రమౌళి,హరీష్, మురళి, టైలర్ జయరాములు, తదితరులు పాదయాత్రకు తరలివెళ్లారు.










