May 15,2023 21:36

ఫొటో : నినాదాలు చేస్తున్న టిడిపి నాయకులు

'యువగళం'కు టిడిపి నేతల సంఘీభావం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు చేస్తున్న 'యువగళం' పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ ఆత్మకూరులోని సోమవారం అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 టెంకాయలు కొట్టి అక్కడ నుండి బైక్‌ ర్యాలీ మొదలుపెట్టి నెల్లూరు పాలెం సెంటర్‌, ఆర్‌టిసి మీదుగా బి.ఎస్‌.ఆర్‌. సెంటర్‌ నుండి బస్టాండ్‌ వరకు చేపట్టారు. స్థానిక బిఎస్‌ఆర్‌ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజా రెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్‌ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుంకర పెంచుల చౌదరి, కేతా విజయభాస్కర్‌ రెడ్డి, జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.