పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నాయకులు
మడకశిర : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు సంబందించిన పోస్టర్లను టిడిపి నాయకులు బుధవారం విడుదల చేశారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మనోహర్, కౌన్సిలర్లు ఉమాశంకర్, హనుమంతు, నాయకులు రామాంజనేయులు, గోవిందప్ప, ఓబన్న తదితరులు పాల్గొన్నారు .










