రొద్దం : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 26న పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ప్రవేశిస్తున్నందున ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కోరారు. సూచించారు. మండలంలోని ఆరుమూరు పల్లి గ్రామంలోని తన స్వగృహంలో మండల నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన మండల నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యువగళం పాదయాత్రపై మండల నాయకులతో చర్చించారు. ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకుల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పెనుగొండ నియోజకవర్గం కమిటీ అధ్యక్షుడు చిన్నప్పయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి నరసింహులు, సీనియర్ నాయకులు రామకృష్ణ, జివిపి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బికె. పార్థసారథి కోరారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం యువగళం పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిద్దయ్య, టౌన్ కన్వీనర్ రవిశంకర్, సీనియర్ నాయకులు మునిమడుగు చిన్న వెంకటరాముడు, కేశవయ్య, శ్రీనివాసులు, పాలడుగు చంద్ర, రఘువీర చౌదరి తదితరులు పాల్గొన్నారు.










