Mar 26,2023 22:17

సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి-రామగిరి : నారాలోకేష్‌ చేపట్టి యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 151 ఎమ్మెల్యేలు ఉన్నారని సీఎం జగన్‌ ఇన్నిరోజులు విర్రవీగారని అన్నారు. ఇక పొద్దు వాలుతోందని,ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతరం నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంబంధించిన విషయాలను చర్చించారు. ఇప్పటివరకు 15 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగిందని వాటన్నింటికీ మించి రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో పాదయాత్ర జరగాలని వారు కోరారు. ఈ నెల 30న చెన్నేకొత్తపల్లి మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందనిఆ రోజు నుంచి ధర్మవరంలో పాదయాత్ర ముగిసే వరకు ప్రతి కార్యకర్త, నాయకుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను మండలాలు వారిగా గుర్తించి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.