Feb 23,2023 19:39

కంభంవారిపల్లెలో మాట్లాడుతున్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి

- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి
ప్రజాశక్తి-పీలేరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కంభంవారిపల్లికి వచ్చిన కిషోర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంరతం కంభంవారిపల్లి మండలంలో గ్రామాల వారిగా పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గంలో మార్చి 4, 5వ తేదీల్లో లోకేష్‌ పర్యటన ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే పాదయాత్రకు టిడిపి కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి కోరారు. కార్యక్రమంలో కెవి.పల్లి మండల అధ్యక్షులు గీతమ్మ, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి కుప్పం రవిచంద్రారెడ్డి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేంద్రరెడ్డి, ఆర్‌.రెడ్డెప్పరెడ్డి, వెంకట రమణ నాయుడు, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి అవినాష్‌రెడ్డి, బాబు నాయుడు, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు అగస్తీశ్వర, కలికిరి మండలం ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు వర్మ, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు భాస్కర, యల్లయ్య, నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు.