Mar 04,2023 19:28

లోకేష్‌తో పాదయాత్రలో రాంప్రసాద్‌రెడ్డి

ప్రజాశక్తి-రాయచోటి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పుంగనూరు వద్ద శనివారం రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు రాంప్రసాద్‌రెడ్డి టిడిపి కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి పాల్గొన నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పడుతూ విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇది చూసి ఓర్వలేని ప్రభుత్వం పాదయాత్రలకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు అండదండలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాదయాత్ర ముందుకు కొనసాగిస్తూ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎండగడుతూ రాబోయే కాలంలో టిడిపి జెండాను ఏగరవేస్తామని పేర్కొన్నారు. రాజంపేట అర్బన్‌ : టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి గంటా నరహరి యువగళం పాదయాత్రలో లోకేష్‌తో కలిసి నడిచారు.