బూట్లు అందజేసిన శ్రీకాంత్ : ప్రజాశక్తి -కందుకూరు : యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతానికి తన వంతు కషిగా తూర్పు రాయలసీమ పట్టభుద్రుల ఎంఎల్‌సి టిడిపి అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాదయాత్రలో నడిచే యువతకు అదిదాస్ కంపెనీ బూట్లను అందజేశారు. శనివారం పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం వద్ద నారా లోకేష్ చేతుల మీదుగా వాలంటీర్ల కోఆర్డినేటర్ రవి నాయుడు, రాష్ట్ర టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్‌తో కలిసి 110మంది వాలంటీర్లకు 3.5 లక్షల విలువ చేసి బోట్లను డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు. డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ మా యువ నాయకులు నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్ర విజయవంతం కావాలని తన వంతు సహాయంగా బూట్లను అందజేశారని తెలిపారు. శుక్రవారం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్‌కు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, విద్యావంతుడు, మంచి మనిషి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ను గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చినందుకు ప్రత్యేకంగా డాక్టర్ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు.










