Mar 07,2023 21:52

పాదయాత్ర ఏర్పాట్లపై చర్చిస్తున్న 'కందికుంట'

తనకల్లు : మండల పరిధిలోని చీకటిమాని పల్లి వద్ద శ్రీ అన్నమయ్య జిల్లా నుండి శ్రీ సత్య సాయి జిల్లాలోకి ఈ నెల 17వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువ గళం పాదయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో టిడిపి కదిరి ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ కార్యక్రమాలు నిర్వహించడానికి స్థల పరిశీలన చేశారు. చీకటిమానిపల్లి వద్ద రాత్రి విడది చేసే స్థలాన్ని పరిశీలిం ఆరోజు ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమై చీకటి మానిపల్లి, గంగసానిపల్లి, నారే వాండ్లపల్లి మీదుగా కొక్కంటి క్రాస్‌ చేరుకుంటుందని, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారని, ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కందికుంట వెంకటప్రసాద్‌ కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రెడ్డి శేఖర్‌ రెడ్డి, కో కన్వీనర్‌ బ్రహ్మానంద రెడ్డి, సీనియర్‌ నాయకులు దేశాయి ప్రభాకర్‌ రెడ్డి, సోంపాలెం నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ రవీందర్‌ రెడ్డి, నాగేంద్రప్రసాద్‌, మహబూబ్‌ బాషా, గోపీనాథ్‌, మహేష్‌, బీసీ నాయకులు శంకర్‌ నాయుడు, ఎస్సీ సెల్‌ చిన్నప్ప, ఓబులేసు, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను కదిరి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.