రాజంపేట రూరల్ : ప్రస్తుతం లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువగళం పాదయాత్ర కాదు యమగళం పాదయాత్ర రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు శనివారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమాత్రం అవగాహన, రాజకీయాలు పరిజ్ఞానం లేకుండా లోకేష్‌బాబు విమర్శలు చేయడం తగదన్నారు. నారా చంద్ర బాబునాయుడు వెన్నుపోటుతో రాజకీయంగా ఎదిగారని వాపోయారు. 14 ఏళ్ల టిడిపి పాలనలో చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తనను, జడ్‌పి చైర్మన్‌ను నారాలోకేష్ విమర్శించడం సిగ్గుచేటని, ఇదంతా స్క్రిప్ట్ చదవడంలా ఉందని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న ఒక్కరైనా కనీసం వార్డు మెంబరుగానైనా గెలిచారా అని ప్రశ్నించారు. కేవలం దొడ్డిదారిలో పదవులు పొందిన వారేనని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసి స్వర్గీయ ఎన్‌టిఆర్‌కు నిజమైన నివాళి అర్పించార్పించారన్నారు. సుమారు రూ. 800 కోట్లతో రాజంపేట నియోజకవర్గాన్ని అభివద్ధి చేశానని చెప్పారు. రాజంపేట జిల్లా తేలేకపోయినా, అభివద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు . ఇసుక వ్యాపారం తాను కానీ, తన కుటుంబం కానీ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, నిరూపించకపోతే లోకేష్ వైదొలుగుతారా అని సవాల్ విసిరారు. 2 వేల ఎకరాలు భూమినీ కబ్జా చేశానని ఆరోపిస్తున్నారని, తనపేరుపై ఉంటే తనకు ఐదెకరాలు ఇచ్చి మిగిలింది ఆయన్ను తీసుకోవచ్చని చెప్పారు. పాదయాత్ర అంటే సాయంత్రం పూట చేసే నడక కాదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు వైసిపి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షులు కష్ణారావు, వైసిపి రాజంపేట మండల కన్వీనర్ రామ్మోహన్ నాయుడు, జిల్లా బిసి సెల్ అధ్యక్షులు, రాజంపేట వార్డు కౌన్సిలర్ పసుపులేటి సుధాకర్, రాజంపేట జెఎసి కన్వీనర్లు వడ్డే రమణ, మందిరం గంగిరెడ్డి, సీనియర్ వైసిపి నాయకులు గడికోట సుబ్బారెడ్డి, సిద్ధవటం మండల వైసిపి నాయకులు కంఠ రెడ్డి మురళి, ఆచారి సత్యాల రామకష్ణపాల్గొన్నారు










