Feb 05,2023 21:59

ఫొటో : జెండా ఆవిష్కరణ చేస్తున్న టిడిపి నాయకులు

'యువగళం' జెండాను ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం కావలి టిడిపి కార్యాలయం వద్ద నారా లోకేష్‌ 'యువగళం' పతాకాన్ని పార్టీశ్రేణుల మధ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ టిడిపి తెలుగుతేజం, యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తలపెట్టి పదిరోజులు పూర్తయిందన్నారు. 100 కిలో మీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కావలి టిడిపి కార్యాలయం వద్ద యువగళం జెండాను ఆవిష్కరించామన్నారు.
ఈ జెండా ఎలాగైతే రెపరెపలాడుతుందో అదే విధంగా పాదయాత్ర కూడా కళకళలాడుతూ విజయవంతం కావాలని కోరుతున్నామరు. ఆయన పాదయాత్ర కావలి నియోజకవర్గానికి ఎప్పుడు వస్తుందా.. అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్‌.మస్తాన్‌, నెల్లూరు పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి పందల రమణమ్మ, దగదర్తి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల ఇబ్రిన్‌, నాయకులు తాల్లురు సుధాకర్‌, కావలి పట్టణ పార్టీ ముఖ్య నాయకులు శానం హరి, ప్రొఫెసర్‌ వెంకటేశ్వర్లు నాయుడు, హరీష్‌, గొట్టిపాటి రాము, నలమోతు శ్రీనివాసులు, మనోహర్‌, వర్తినేని శ్రీనివాసులు, కొల్లూరి నారాయణ, చల్ల శ్రీహరి, కావలి వెంకటేశ్వర్లు, చెన్నూరు అరుంధతీయవాడ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.