యుటిఎఫ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆత్మకూరు పట్టణంలోని ఆర్‌టిసి బస్టాండ్ వద్ద నుండి యుటిఎఫ్ ఆధ్వర్యంలో పలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ర్యాలీగా బయల్దేరి నినాదాలు చేస్తూ సత్రం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ సీనియర్ నాయకులు లక్కు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సకాలంలో జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాజకీయ ప్రవేశం లేనటువంటి ఎంఎల్‌సి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి గెలవాలని తపన ఇవాళ చూస్తున్నామని తెలిపారు. ఆత్మకూరులో రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది వైసిపి ప్రభుత్వం తెలిస్తే ఇవి ఏమీ పరిష్కారం కావన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన జిఒ విడుదల చేస్తే ఆ జిఒలో చర్చ జరిగే శాసనమండలికి సారాయి వ్యాపారస్తులు నిత్యం వ్యాపారాలు చేసే పోటీలో పెట్టారని తెలిపారు. ఇది గమనించి చదువుకున్న మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు గమనించి ఈ పెద్దల సభకు పిడిఎఫ్ ఎంఎల్‌సి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల నాయకులు డేవిడ్ రాజు, విశ్రాంతి ఉపాధ్యాయులు శ్రీరాములు, యుటిఎఫ్ నాయకులు గంగాధర్, శివయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సంధాని, ఎం నాగేంద్ర, ఆత్మకూరు నాగయ్య, వాగాల శ్రీహరి, రాధమ్మ, నాయకులు నంద శీను, బాలాజీ, తదితరులున్నారు.










