పుట్టపర్తి అర్బన్ : యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన పదవ తరగతి నమూనా పరీక్షా పత్రాల పుస్తకాలను కలెక్టర్ పి.బసంత్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి యు.మీనాక్షితో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన పది పరీక్ష నమూనా పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. వీటిని పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిఇఒ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగి రాష్ట్రంలోనే మంచి స్థానాన్ని పొందాలన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగేంద్ర మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యారంగం, విద్యార్థుల విద్యాభివద్ధికి నిరంతరం పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలను దష్టిలో ఉంచుకుని తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో మోడల్ పుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. గత 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ రంగంలో నిష్ణాతులైన నిపుణులతో అన్ని సబ్జెక్టుల్లో నాలుగు మోడల్ పేపర్స్‌ను సమాధానాలతో కలిపి తయారు చేయించామన్నారు. 10వ తరగతి విద్యార్థులు అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.భూతన్న, సహాధ్యక్షులు జిహెచ్.బాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎంవి.మారుతి, శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు డి.శ్రీనివాసులు, సి.హరికష్ణ, కె.చంద్రశేఖర్ నాయుడు, చెన్నకేశవులు, ఎం.ఆంజనేయులు, శివ, మహలింగప్ప, గోపాల్, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.










