యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురం, ఉదయగిరి మండలాల యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం ఉదయగిరిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.వి.శేషులు హాజరయ్యారు. మండల యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శిగా గొడ్లవీటీ వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా భోగ్యం శ్రీనివాసులు, కోశాధికారిగా సిహెచ్.ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వి.వి.శేషులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదని వారిపై అనుకూలమైన వైఖరి అనుసరించడం సరైన పద్ధతిని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉపాధ్యాయులకు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిఎ అరియర్స్‌కు షెడ్యూల్ ప్రకటించాలని సిపిఎస్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని 2023 జులై నుండి 12వ పిఆర్‌సి అమలు చేయాలన్నారు. కావున త్వరగా పిఆర్‌సి కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధ నేతర, నాడు-నేడు పనుల నుంచి మినహాయింపునిచ్చి కేవలం బోధనకే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని ఆయన కోరారు. నూతన కమిటీల ఎన్నికల అధికారిగా జిల్లా కౌన్సిలర్ ఎడమ తిరుపతయ్య వ్యవహరించారు.










