ఫొటో : క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్ నాయకులు
యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండల విద్యాశాఖ అధికారి షేక్ షావుద్దీన్, వరికుంటపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఎంఇఒ కార్యాలయంలో యుటిఎఫ్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఇఒకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్ వి నారాయణ, రాధాకృష్ణ, నేతలు సుబ్బారావు, రావిళ్ల నాగార్జున, షేక్ కరిముల్లా, డి.వెంకటేశ్వరరావు, దామోదర్‌రావు, హరిచంద్ర ప్రసాద్, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరరావు, రాజేంద్ర, రావూఫ్, తదితరులు పాల్గొన్నారు.










