Dec 30,2022 22:43

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - లేపాక్షి : స్థానిక రిసోర్స్‌ సేెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో తయారైన 2023 సంవత్సరం క్యాలెండర్‌ను ఎంఇఒ నాగరాజు నాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో యుటిఎఫ్‌ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు సురేష్‌ బాబు, ముస్తఫా, నాయకులు రమణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు