లేపాక్షి : శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన లేపాక్షి ఆలయానికి యూనిస్కో శాశ్వత గుర్తింపును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా కృషి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు. మంగళవారం ఆమె లేపాక్షి దుర్గా పాపన్నేశ్వర వీరభద్ర ఆలయం, ఏకశిలా నంది విగ్రహాలను దర్శించుకున్నారు. ఏకశిలా నంది ఆలయ విశిష్టతను ఆలయ గైడ్ వీరిప్పన్న వివరించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ లేపాక్షి ఆలయం, ఇక్కడి కట్టడాలు దేశానికే గర్వకారణం అన్నారు. ప్రతి కట్టడం గత చరిత్ర అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఏకశిల నంది దేశంలోనే ఒక ప్రత్యేకమైన శిల్పం అన్నారు. లేపాక్షిని పర్యాటకంగా, అధ్యాత్మికంగా మరింత అభివద్ధి చేస్తామన్నారు. అభివద్ధిలో భాగంగా టిటిడి సహకారంతో కళ్యాణ మంటపం నిర్మించడానికి కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ గిరిజమ్మ, టూరిజం అధికారులు ఈశ్వరయ్య, స్థానిక సర్పంచి ఆదినారాయణ, వైస్సార్సీపీ మండల కన్వీనర్ నారాయణ స్వామి, వైస్ ఎంపిపి అంజిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.










