Feb 03,2023 21:14

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : ప్రభుత్వ అసైన్మెంట్‌ భూములు గుర్తింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరగా ప్రతిపాదనలు పంపించాలని తహశీల్దార్లను కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్లో అసై న్మెంట్‌ భూములు, రీ-సర్వే, క్లరికల్‌ కరెక్షన్స్‌ ఆఫ్‌ మాడ్యుల్స్‌ డిజిటల్‌ సిగేచర్‌ స్టేటస్‌, హౌస్‌ సైట్స్‌ తదితర రెవెన్యూ అంశాలపై ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం చూపించడంలో నిర్లక్ష్యం వహించకుండా వచ్చే వారం నాటికి గ్రౌండ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్‌మె ంట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎంత భూమిని గుర్తించారు, ఇంకెంత గుర్తించాల్సి ఉంది, మొత్తం ఎన్ని ఫైల్స్‌ సిద్ధం చేయాలి, ఎన్ని చేశారు, ఇంకను చేయాల్సినవి ఎన్ని తదితర అంశాలలో కలెక్టర్‌ సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. రీసర్వే అంశంలో భాగంగా గ్రామాలలో మాడ్యుల్స్‌ అన్ని పక్కాగా పూర్తి చేయాలని చెప్పారు. శాశ్వత భూ హక్కు పత్రాలు, పాసుబుక్‌ లను అందుకున్న రైతులు ఇకెవైసి నమోదు పెండింగ్‌ లేకుండా పూర్తి చేయించాలని అన్నారు. భూ హక్కు పత్రాలు ఇకెవైసి 7750 పూర్తి చేశారని, 2003 చేయాల్సి ఉందని, తహశీల్దార్లు సీరియస్‌ గా తీసుకొని పూర్తి చేయాలన్నారు. వచ్చేవారం నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పండింగ్‌ ఉండకూడదన్నారు. అనంతరం క్లరికల్‌ కరెక్షన్స్‌ ఆఫ్‌ మాడ్యుల్స్‌ - డిజిటల్‌ సిగేచర్‌ ప్రగతి పై సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. జగనన్న కాలనీ లేఅవుట్‌ రెవెన్యూ రికార్డులోని ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం నాటికల్లా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారుల ఇకెవైసి పూర్తి చేయించాలన్నారు. జగనన్న కాలనీ లేఅవుట్‌ లో ఇంకా ప్లాట్‌లు ఖాళీగా ఉంటే, 90రోజుల ఇళ్ల దరఖాస్తులకు అర్హులైన వారికి ఇంటి పట్టా మం జూరుతో పాటు ఫ్లాట్‌ అలాట్‌ చేయాలన్నారు. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్‌ ప్రపోజల్‌ మంగళవారం కల్లా పంపించాలని ు ఆదేశించారు. జిల్లాలో ఫారం -6 క్లెయిమ్స్‌ పెం డింగ్‌ 2645, అన్ని ఫారాలు 5600 పెండింగ్లో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలి అన్నారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లె ఆర్‌డిఒలు రంగస్వామి, మురళీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఎడి జయరాజ్‌, తహశీల్దార్లు పాల్గొన్నారు.