Jun 21,2023 19:20

యోగా చేస్తున్న మేయర్‌

యోగా చేస్తున్న మేయర్‌
యోగా సాధనతో సంపూర్ణ జీవనం సాధ్యం
నెల్లూరు:ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం పెంపొంది తద్వారా సంపూర్ణ జీవనం సాధ్యమవుతుందని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ స్రవంతిజయవర్ధన్‌ పేర్కొన్నారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ''ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయుష్‌'' జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎ.సి.సుబ్బారెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉదయం నిర్వహించిన యోగా సాధనా తరగతుల్లో మేయర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ యోగా సాధన ద్వారా చక్కటి శరీర ఆకతిని పొంద
వచ్చని, ఆధ్యాత్మికత, శ్వాస మీద ధ్యాస, ధ్యానము వంటి వివిధ ప్రక్రియలతో శారీరక, మానసిక ధడత్వాన్ని సాధించగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా సాధనను భాగంగా చేసుకుని సంపూర్ణ ఆర్యోగ్యవంతులు కావాలని మేయర్‌ ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన కుటుంబంతో చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని మేయర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటి కమీషనర్‌ చెన్నుడు, టి.పి.ఆర్‌.ఓ ప్రసాద్‌, సెట్నల్‌ సి.ఇ.ఓ పుల్లయ్య, ఆయుష్‌ వైద్యులు డా.వినోద్‌, రామచంద్ర మిషన్‌ ప్రతినిధులు, ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, యోగా శిక్షకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.