Jan 13,2023 22:21

ఫొటో : యల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రామ్‌సెంటర్‌ నిర్వాహకులు

యల్లాప్రగడ సుబ్బారావు జయంతి
ప్రజాశక్తి-కావలి : డాక్టర్‌ రామ్‌సెంటర్‌ విశ్వోదయ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి చిన్నమ్మ ఆరోగ్య సదనం సహకారంతో శుక్రవారం డాక్టర్‌ ''యల్లాప్రగడ సుబ్బారావు జయంతి వారోత్సవాల సంద ర్భంగా కావలి రాజీవ్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్‌, హెట్రాజాన్‌, ఫోలిక్‌ ఆమ్లము విటమిన్‌ బి12.వంటి అనేక అద్భుత ఔషధాలను ప్రపంచానికి అందజేసి, ప్రపంచ శాస్త్రవేత్తల ప్రశంసలు పొందిన గొప్ప భారతీయ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు అన్నారు.
ప్రపంచంలోని వైద్య శాస్త్రవేత్తలు ఆయనను అద్భుత ఔషధాల సృష్టికర్తగా కొనియాడారన్నారు. దోమకాటు వల్ల సంక్రమించే బోదకాలు, టైఫాయిడ్‌, పాండురోగం వంటి వ్యాధుల నివారణకు వాడే హైట్రాజన్‌ను కూడా కనిపెట్టారన్నారు. అంతేకాదు క్షయ రోగానికి శాశ్వతమైన బసోనికోటి నికాసిడ్‌, హైడ్రాక్సైడ్‌ మందులను కనిపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మేఘనాథ్‌ చౌదరి, డాక్టర్‌ రామ్‌సెంటర్‌ చైర్మన్‌ మనోహరరెడ్డి, డైరెక్టర్‌ తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి, సి.ఒ. సునీత తదితరులు పాల్గొన్నారు.