May 06,2023 21:59

ఫొటో : మాజీ ఎంపి మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రైతులు

యార్డ్‌ ఏర్పాటు చేయాలని వినతి
ప్రజాశక్తి-ఉదయగిరి : పసుపు కొనుగోలు యార్డును ఏర్పాటు చేయాలని మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి ఎపి రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. శనివారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని తమ నివాసంలో ఆయనను కలిసి ఉదయగిరిలో పసుపు యార్డు ప్రారంభించి ఈ ప్రాంత పసుపు రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక వడ్డీలతో అప్పులతో పండించిన పసుపు పంట చేతికి వచ్చి కొనుగోలుకు సిద్ధంగా ఉందని వెంటనే యార్డును ప్రారంభించాలని రైతులను ఆదుకోవాలని కోరి ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొటాలపల్లి సొసైటీ అధ్యక్షులు కల్లూరి రమణారెడ్డి, దేవస్థాన శ్రీనివాసులు రెడ్డి, కొండా రమణారెడ్డి చెంచురామిరెడ్డి, ఏ వెంకటేశ్వర రెడ్డి, షేక్‌ ఫరీద్‌, బండి రమణయ్య, మూల రమణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుబ్బారెడ్డి, ఏ.రామిరెడ్డి, చంద్రమౌలేశ్వర్‌ రెడ్డి, తదితరులు పాల్గన్నారు.