Jan 31,2023 19:40

రైతులకు సూచనలిస్తున్న ఉద్యాన అధికారి సురేష్‌బాబు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : అరటి రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా సాగు చేయడం వలన అధిక దిగుబడి వస్తుందని మండల ఉద్యాన అధికారి జి.సురేష్‌ బాబు తెలియజేశారు. మంగళవారం మండల పరిధిలోని అనంతరాజుపురం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో అరటి సాగు చేస్తున్న రైతులకు సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ, నాణ్యతతో కూడిన పంట దిగుబడులు సాధించడానికి చేయవలసిన ఇతర యాజమాన్య పద్ధతుల గురించి ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అరటిలో పనామా ఎండు తెగులు, పండు ఈగ నివారణకు తగు సూచనలు చేశారు. గెల తొడుగులు వాడకం ద్వారా రసం పీల్చే పురుగుల భారి నుంచి కాయాలని కాపాడడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన పంట దిగుబడులను పొందవచ్చునని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్‌బికె సిబ్బంది ఝాన్సీ, కళ్యాణ్‌, రైతులు పాల్గొన్నారు.