Jul 01,2023 16:41
  • ప్రపంచకప్‌కు అర్హత సాధించని రెండుసార్లు ఛాంపియన్‌
  • స్కాట్లాండ్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి

హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో వెస్టిండీస్‌ జట్టు విఫలమైంది. అర్హత టోర్నీలో భాగంగా జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన విండీస్‌ జట్టు.. సూపర్‌-6లో పసికూన స్కాట్లాండ్‌ చేతిలోనూ చిత్తుగా ఓడింది. శనివారం స్కాట్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ జట్టు 7వికెట్ల తేడాతో ఓటమిపాలై చరిత్రలో తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది.

2

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి స్కాట్లాండ్‌ బౌలర్లు దెబ్బకు 43.2ఓవర్లలో 181పరుగులకే ఆలౌటైంది. హోల్డర్‌(45), షెఫర్డ్‌(36) టాప్‌స్కోరర్స్‌. ముల్లెన్‌కు మూడు, సోలే, వాట్‌, గ్రేవ్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో స్కాట్లాండ్‌ జట్టు ఓపెనర్‌ మెక్‌బ్రిడే(0) వికెట్‌ను త్వరగా కోల్పోయినా.. మెక్‌ముల్లెన్‌, క్రాస్‌ కలిసి 2వ వికెట్‌కు 125పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధసెంచరీ పూర్తయ్యాక ముల్లెన్‌(69) ఔటైనా.. క్రాస్‌(74నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసాడు. హోల్డర్‌, షెఫర్డ్‌, హొసైన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో స్కాట్లాండ్‌ జట్టు 7వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ జట్టును ఓడించి మెగా టోర్నీకి అర్హత సాధించే రేసులో నిలువగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ముల్లెన్‌కు లభించింది.

westindies