రైతు భరోసా కేంద్రాలను పరిశీలిస్తున్న ఎడిఎ అనసూయ
ప్రజాశక్తి-కందుకూరు :మండలంలోని ఓగూరు పలుకూరు రైతు భరోసా óకేంద్రాలను కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు పి అనసూయ గురువారం సందర్శించారు. గ్రామ వ్యవసాయ సిబ్బందికి సూచనలు చేశారు. సమయపాలన పాటించాలని, పథకాల గురించి రైతులకు వివరించాలని పచ్చి రొట్టె విత్తనాలు సరైన సమయంలో అందజేయాలని సూచించారు. మట్టి పరీక్షలకు రైతుల మట్టి నమూనాలను సేకరిం చాలన్నారు. అర్హులైన లబ్ధిదారులు పిఎం కిసాన్ 14వ విడత డబ్బులు పొందడానికి తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలన్నారు. కందుకూరు మండల వ్యవ సాయధికారి రాము ఉన్నారు.










