నూనత కార్యవర్గాన్ని సన్మానిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి - రాయచోటి: జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల నూతన సంఘం . ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షులుగా కె.నవీన్ కుమార్ రెడ్డి సెక్రటరీగా, కె. రమేష్ బాబురావు , కోశాధికారిగా బి. వెంకట్ మోహన్, ఉపాధ్యక్షులుగా సుధాకర్, ఉప కార్యదర్శిగా కె.వి రమణకుమార్, గౌరవ అధ్యక్షులుగా జి.రమేష్ బాబు , గౌరవ సలహాదారులుగా రమణ కుమార్, శ్రీలత, ఇసి సభ్యులుగా ఆరుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల ఉన్నతికి కషి చేస్తూ, రైతులకి మరిన్ని సేవలు అందించే విధంగా కషి చేస్తామని సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ జిల్లాలోని వ్యవసాయ అధికారులు పాల్గొన్నరు.










