ప్రజాశక్తి - మైలవరం (ఎన్‌టిఆర్ జిల్లా) : వ్యవసాయానికి వాడుతున్న మోటార్లకు నీటి మీటర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాన్ని ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.ఆంజనేయులు కోరారు. నీటి మీటర్ల వ్యతిరేకిస్తూ మైలవరంలోని మొరుసుమల్లిలో సిపిఎం నాయకులు కరపత్రాలు పంచుతూ.. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతులను దివాలా తీసే విధానాలు తీసుకువచ్చి రైతు మెడకు ఉరి తాడు వేస్తుందన్నారు. ఒకపక్క అధిక ధరలతో ప్రజల సతమతమవుతుంటే మరో ప్రక్క దేశానికి అన్నం పెట్టే రైతన్నను నడ్డివిరిచే విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలు సాగనంపాలన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆర్ రమేష్, వజ్రాల వెంకట రెడ్డి, ముత్యాలరావు, స్వామి, జెట్టి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










