వయోవద్ధులపై వేధింపులు మానుకోవాలి- సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ
మదనపల్లె అర్బన్ : వయో వృద్ధులపై వేధింపులు మానుకోవాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక జిఆర్‌టి ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసో సియేషన్ అధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ, కార్యదర్శి వి.ఎం.నాగరాజు, కోశాధి కారి ఉస్మాన్ సాహెబ్, గౌరవాధ్యక్షలు కె.మునిరత్నమయ్య, ఉపాధ్యక్షులు జగన్ మోహన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వద్ధుల వేధింపుల నివారణ అవగా హన దినోత్సవం నిర్వహించారు. వద్ధులపై వేధింపులు నివారించాలనే నినాదా లతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ తరిగి పోతున్న మానవ, నైతిక విలువలు, కుటుంబ బాంధ్యవ్యాలు కనుమరుగవ్వటం, ఆధునిక జీవన శైలి, వేధింపులకు గల కారణాలు అందులో రకాలు గురించాలని పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వద్ధులను శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక, హక్కుల ఉల్లంఘన, పద్ధతి ప్రకారం వేధించటం జరుగుతోందని తెలిపారు. వద్ధులపై వేధింపులు, చట్టపరంగా ఉన్న రక్షణ గురించి సమగ్రంగా వివరించారు. గౌరవ అధ్యక్షులు ముని రత్నమయ్య మాట్లాడుతూ వద్ధులపై వేధింంపులు మానాలన్నారు. కార్యదర్శి నాగరాజు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, గొల్లపూడి తిరుపతిరావు మాట్లాడుతూ వద్ధులపై వేదింపులకు పాల్పడితే వారికున్న రక్షణ చట్టాల గురించి అవగాహన పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో ధనలక్ష్మి, మనోహరమ్మ, సరస్వతమ్మ, రామచంద్రయ్య, కృష్ణకుమార్, కృష్ణమూర్తి, ఉస్మాన్, జగన్ మోహన్ పాల్గొన్నారు.










