Nov 22,2022 22:06

వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తిఅర్బన్‌ : వ్యాధుల నివారణలో హోమియోపతి వైద్యం కీలక పాత్ర వహిస్తోందని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక హనుమాన్‌ సర్కిల్‌లో ఆయుర్వేద, హోమియోపతిఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ తో పాటు ఆయుష్‌ కమిషనరు వి. రాములు ప్రారంభించారు. సత్యసాయి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆర్‌ వి జానకిరామయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు హోమియోపతి, ఆయుర్వేదంలో ఉత్తమ వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలను పొందాలన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ ఎస్‌వి కృష్ణారెడ్డి, ఆయుష్‌ ఆర్‌జెడి కెవి. కుమార్‌ బాబు, వైద్యులు డాక్టర్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.