Jan 17,2023 21:09

మాట్లాడుతున్న సూరా శ్రీనివాసులరెడ్డి

మాట్లాడుతున్న సూరా శ్రీనివాసులరెడ్డి
వవ్వేరు కో-ఆపరేటివ్‌
చైర్మన్‌ పదవికి 'సూరా'రాజీనామా
కొడవలూరు:బుచ్చిరెడ్డి పాళెంలోని వవ్వేరు కో-ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరో 10 రోజుల్లో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బ్యాంకు చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన పదవీ కాలంలో తనకు సహకరించి అధికారులకు, ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన 10 ఏళ్ల పదవీ కాలంలో బ్యాంకు అభివద్ధికి విశేషంగా కషి చేశానని వెల్లడించారు. ఆయన్ను ఛైర్మైన్‌ పదవి నుండి సస్పెండ్‌ చేసే అవకాశాలు ఉన్నందునే ముందుగానే రాజీనామా చేసి
నట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంకు సంబందించిన నగదును తన సొంతానికి వాడుకున్నట్లు గతంలో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలపై సహకార శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా ఆయన సహకార శాఖ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో అనూహ్యంగా సూరా శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. సూరా శ్రీనివాసులు రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడు.