ఫొటో : వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తున్న డి. ఆర్. విశ్వోదయ బాధ్యులు
వృద్ధులకు నిత్యావసరాలు పంపిణీ
ప్రజాశక్తి-కావలి : డి. ఆర్. విశ్వోదయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 65 మంది నిరుపేద వృద్ధులకు రూ.65వేల విలువైన బియ్యం, నిత్యావసర వస్తువులు, నగదులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమాచంద్ హాజరై పంపిణీ చేశారు. నిరుపేదలైన వృద్ధులకు డాక్టర్ డి.ఆర్.విశ్వోదయ సేవాసమితి చేస్తున్న వితరణ కార్యక్రమాలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినరు కుమార్ రెడ్డి, డి.ఆర్.విశ్వోదయ సేవాసమితి సభ్యులు నల్లూరి రామ కృష్ణప్రసాద్, అమరావతి, సతీష్ సింగ్, రంగనాయకులు, జె.బి.జూనియర్, విద్యార్థులు పాల్గొన్నారు.










