May 19,2023 20:57

- సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి కేశప్ప

మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి పట్టణంలో వద్ధ దంపతుల బలవన్మరణంలో పోలీసుల ప్రమేయం లేదని డిఎస్‌పి కేశప్ప తెలిపారు. శుక్రవారం తన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవలతో, తండ్రి కొడుకుల మధ్య ఆర్జీ తగాదా, అనారోగ్య కారనాలవనన వారు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆస్తివివాదమై తంబళ్లపల్లి పోలీస్‌ స్టేషన్లో ఈ నెల 17వ తేదీ నరసింహులు నాయుడుపై అతని తమ్ముడు అప్పల్ల ఫిర్యాదు చేశారని, మా అన్న నన్ను బెదిరిస్తున్నాడని, ఆస్తి విషయమై అడిగిత దాడికి దిగుతున్నాడని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ఫోన్‌ ద్వారా విషయాన్ని చెప్పి వచ్చి సమస్యను పరిష్కరించు కావాలని నరసింహులు, సుబ్బమ్మ దంపతులకు తెలిపిపారని, అప్పుడు నరసింహులు నాయుడు నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, విరూపాక్షపురం వెళ్లాలని పోలీసులకు వివరణ ఇవ్వడంతో ఏదో ఒక సమయంలో అయినా వచ్చి పరిష్కరించుకోమని పోలీసులు తెలిపారు. అప్పులనాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించుకోమని చెప్పారు తప్ప ఎక్కడా బెదిరించలేదన్నారు. వ్యక్తిగత కారణాలైన ఆర్జీ, కుటుంబ సమస్యల వలననే వద్ధ దంపతులు పురుగుల మందును కూల్‌ డ్రింక్‌లో కలుపుకొని అనపగుట్ట తమ స్వగహంలో ఆత్మహత్య చేసుకొన్నారన్నారు. ఈ విషయంపై మదనపల్లె టూ టౌన్‌ పోలీస్‌ వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు వారిని బెదరించడం లేదా సివిల్‌ వివాదాలలో తలదూర్చడం అవాస్తవమన్నారు.