కేక్ కట్ చేస్తున్న క్రీడాకారులు, తదితరులు
ధర్మవరం టౌన్ : ఇండియన్ మహిళలు అండర్-19 టీ 20 వరల్డ్ కప్ గెలుపుపై స్థానిక ఆర్జీటీ క్రీడామైదానంలో మంగళవారం క్రికెట్ క్రీడాకారిణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిలతో కలిసి క్రికెట్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు వడ్డెబాలాజీ తదితరులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు శేషు, ఫృథ్వీ, ఆర్డీటీ క్రికెట్ కోచ్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.










