కర్నూల్ : వరకట్న వేధింపులను తట్టుకోలేక గర్భిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. కర్నూలు మించిన్‌బజార్ లో నివాసముంటున్న 4 నెలల గర్భవతి అఖిల (21) అత్తమామల వరకట్న వేధింపులను తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మఅతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.










