రాయచోటి : జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరి పంట కోతకు రైతన్నలు సంసిద్ధమయ్యారు. .అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి సాధారణ విస్తీర్ణం 188806 ఎకరాలుండగా11385 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా పీలేరు 655, కె.వి. పల్లె 372, వాయల్పాడు 1127 , గుర్రంకొండ 661, కలికిరి 1148 ,కలకడ 497, పెద్దమండెం 498, మదనపల్లె 211, నిమ్మనపల్లి 10 72, రామసముద్రం 306, బి.కొత్తకోట 151, కురబలకోట 98, తంబళ్లపల్లె 279, ములకలచెరువు 61, పెద్ద తిప్ప సముద్రం 248, కోడూరు 57, చిట్వేల్ 43, ఓబులవారిపల్లె 174 , పుల్లంపేట 2, రాజంపేట 492, పెనగలూరు 134, నందలూరు 700 ,వీరబల్లి 45, రామాపురం 106, గాలివీడు 475, ఎల్‌ఆర్ పల్లి 326, చిన్నమండెం 506, సంబేపల్లి 408, సుండుపల్లె 142, రాయచోటి 392 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. ఈ సీజన్ అధిక దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ రోజు రోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు రైతులపైనా దీని ప్రభావం పడింది. గత ఏడాది ఒక ఎకరం వరి చేను కోయడానికి కోత మిషన్ కు రూ.2,000 నుంచి రూ.2100 ఉండగా ఆయిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో రూ.2500 నుంచి రూ.2600 పలుకుతుందని రైతులు అంటున్నారు. దీంతో తమపై అదనపు భారం పడిందని రైతున్నలు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాన్యం కొనాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖర్చులు పెరిగాయి..
వరి పంట చేతికి వచ్చే సమయానికి ఖర్చులు భారంగా మారాయి. మందులు, ఎరువులు ధరలు అమాంతంగా పెరిగాయి. వరి పంటలో రైతులకు గిట్టు బాటు ధర దక్కడంలేదు. వరి పంట కోత ఏడాది పెరుగుతూనే పోతున్నాయి.ఎకరానికి సుమారుగా రూ. 40 వేల వరకు ఖర్చు అవుతోంది.
-అబ్బవరం వెంకటరమణ, రైతు, రాయచోటి
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇప్పటికి వరకు నందలూరు, రాజంపేట, కోడూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోతలు పూర్తి అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 10 రోజులకు కోతలు పూర్తి అవుతాయి.
-ఉమామహేశ్వరమ్మ జిల్లా వ్యవసాయ అధికారి, రాయచోటి.










