కేంద్రంలోని బిజెపి సర్కారు వంటింటి మహిళల మనీ ప్యాకెట్లకు చిల్లు పెడుతోంది. 2014 నుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల వ్యవధిలో సుమారు 16 నుంచి 23 దఫాలకుపైగా గ్యాస్ ధరలను పెంపు రూపంలో కాజేసింది. 2014 యుపిఎ హయాంలో గ్యాస్ సిలిండర్ రూ.400 ఉండగా, కేంద్రంలోని బిజెపి సర్కారు హయాంలో ఎనిమిదేళ్లలో రూ.800 పెంచేసింది. గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 చేరుకుంది. ఉమ్మడి కడప జిల్లాపై దఫాకు సుమారు రూ.4 కోట్ల చొప్పున ఎనిమిదేళ్లకు రూ.64 కోట్లకు పైగా భారపడింది. గ్రామీణ మహిళలు గ్యాస్‌ను వదిలి కట్టెల పొయ్యికి మారుతున్నారు. దేశంలో కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే గ్యాస్ ధరల పెంపు జోలికి వెళ్లదు. సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేకపోతే గ్యాస్ ధరల పెంపునకు అడ్డూ అదుపు లేకుండా పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ప్రజావ్యతిరేక వినాశకర విధానాలను తిప్పికొట్టాలంటూ ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు మోడీని గద్దె దింపండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో వామపక్షాలు చేపట్టిన ప్రచార భేరీని ఆదరించి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఉమ్మడి కడప జిల్లాలో 8,12,013 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలోని మూడు గ్యాస్ ఏజెన్సీలు నెలకు 8 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు అంచనా. ఇండేన్ ఏజెన్సీ నాలుగు లక్షలు, హెచ్‌పిసిఎల్ 2.64 లక్షలు, బిపిసిఎల్ 1.26 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. రోజుకు సగటున 28 వేల సిలిండర్ల చొప్పున నెలకు ఎనిమిది లక్షల సిలిండర్లు వినియోగమవుతున్నట్లు తెలుస్తోంది. 2014 యుపిఎ హయాంలో సిలిండర్ రూ.400 లభించేది. యుపిఎ అనంతరం వచ్చిన ఎన్‌డిఎలో బిజెపి సర్కారు హయాంలో 16 సార్లు గ్యాస్ ధరలను పెంచిన ఘనతను మూటగటు ్టకుంది. ప్రతిదఫా రూ.50 నుంచి రూ.100 చొప్పున పెంచుకుంటూ పోతోంది. 2022 జులై ఐదున, 2023 మార్చి ఒకటిన సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్లలో రూ.64 కోట్ల మేరకు భారం పడింది. 2022 మార్చి, మే ఏడు, జులై ఏడు, 2023 మార్చి నెల నాటికి నాలుగు దఫాలకుపైగా పెంచింది. వరుస ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీలకు లాభాల పంటను పండిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేరుతో గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుం డడం ఆందోళన కలిగిస్తోంది. రష్యాపై పాశ్చాత్యదే శాలు ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇండి యాకు తగ్గింపు ధరలతో గ్యాస్, పెట్రోలియం ఉత్ప త్తులను రష్యా విక్రయిస్తున్నప్పటికీ సామా న్యులకు గ్యాస్ ధరలను తగ్గిం చకపోవడం గమ నార్హం. గతే డాది సిలిండర్‌కు రూ.1050 చొప్పున సిలిండర్‌ను చెల్లించాల్సి వచ్చేది. 2023 మార్చి ఒకటిన పెంచిన ధరల పెంపుదలతో రూ.1,155 చేరులకుంది. కేం ద్రంలోని బిజెపి సర్కారు వరుస క్రమంలో గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో గ్రామీణ గృహిణులు కట్టెల పొయ్యికి మరలిపోతున్న వైనం కనిపిస్తోంది. గతంలో గ్యాస్ సబ్సిడీని కస్టమర్ల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కస్టమర్ల ఖాతాల్లో సబ్సిడీ జమ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు సబ్సిడీని విని యోగదారుల ఖాతాల్లో జమ చేయకపోవడం, మరో వైపు ఉన్నఫళంగా గ్యాస్ ధరలను అమా ంతంగా పెంచడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో లియం ఉత్పత్తుల ధరల పెంపుదల కార ణంగా ఒక వైపు నిత్యావసరాలు, కూరగాయల ధరలు మండు తుండగా, మరో వైపు గ్యాస్ ధరల పెంపు రూపంలో మహిళల మనీ ప్యాకెట్లను ఖాళీ చేస్తుండడం ఆందో ళన కలిగిస్తోంది. ఇటు వంటి వినాశకర విధానాల వేగాన్ని నిలవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్యాస్ ధర గుదిబండగా మారిందినిత్యవసర ధరలతో పాటు అంతకంటే వేగంగా గ్యాస్ ధర ఆకా శానికి నిచ్చెన వేస్తోంది. దీంతో మళ్లీ మనం కొన్ని దశాబ్దలు వెనక్కి వెళ్లి కట్టెల పొయ్యితో వంట చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గ్యాస్ సబ్సిడీ కూడా కేంద్రం ప్రభుత్వం ఎత్తివేసింది. రోజువారి తగ్గిన నేపథ్యంలో నిత్యావసర, గ్యాస్, పెట్రోల్ ధరలు అమా ంతంగా పెరుగుతున్నాయి. దీని వల్ల సామా న్యులు జీవించలేని స్థితికి వచ్చేశారు.
- డి.ఆర్. మధురవాణి, గృహిణి, మదనపల్లె.గ్యాస్ ధర క్రమంగా పెంచుతున్నారుగ్యాస్ ధర క్రమంగా పెంచుతు న్నారు. గతంలోరూ. 4వందల వరకు సబ్సిడీ అకౌంట్‌లో జమ చేసేవారు. ప్రస్తుతం సబ్సిడీ లేదు. సిలిండర్ ధర రూ. 1150, డెలివరీ ఛార్జీ రూ. 40తో కలిపి రూ. 1200 వసూలు చేస్తు న్నారు. గ్యాస్ ధర అమాంతంగా పెరిగి పోవడంతో కొనలేని స్థితికి చేరుకున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవు తున్నాయి. సామాన్య మధ్య తగతి ప్రజలకు గ్యాస్ ధర భారంగా మారింది. ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించాలి.
ఐశ్వర్య, గహిణి, చాపాడు.










