రూరల్ ఎంఎల్‌ఎను ఆశీర్వదిస్తున్న మహిళలు
వంతెన నిర్మాణం కోసం జలదీక్ష
నెల్లూరు :పొట్టేపాళెం గ్రామ సమీపంలోని కలుజు వద్ద ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ అతి త్వరలో 9 గంటల పాటు జలదీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్లో గూటూరు శ్రీధర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎంఎల్‌ఎ కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ అనుమానం ఉన్నచోట ఉండకూడదని 15 నెలల రాజ్యాధికారాన్ని వదులుకొని బయటకు వచ్చాన్నారు. తాను అత్యంత కష్టకాలంలో ఉన్నప్పటికీ , ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించానన్న కారణంతో తనపై కేసులు బనాయించినా, ఏడాదిపాటు జైల్లో పెట్టినే లెక్క చేసే ప్రసక్తే లేదని,విద్యార్ధి జీవితం నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో బెదిరింపులు చూసానని ప్రజల ఆశీస్సులు ముందు కష్టాలు లెక్కలేదన్నారు. గత 9 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలమధ్యలో ఉంటూ ప్రతి ఒక్కరి నోటిలో శ్రీధరన్నా అని ఆప్యాయంగా పిలిపించుకున్నాన్నారు. అధికార పార్టీ శానసభ్యుడిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగా ఆ సమస్యలను పరిష్కరించకపోగా తన ఫోన్ ట్యాపింగ్ చేసి అవమానానికి గురిచేశారన్నారు.










