Jan 13,2023 22:16

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీనివాసులు

వలంటీర్లు బాధ్యతగా పనిచేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు మండలంలోని వలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేసి మీ పంచాయతీలలో ప్రజల మన్నలను పొందాలని ఆయన కోరారు.
19 నుంచి వెంకటాచలంలోని యూత్‌ కేంద్రంలో ఆపద మిత్ర శిక్షణా కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. మండలంలోని అప్పారావు పాలెం, బండారు పల్లి గ్రామ వాలంటీర్లు పాల్గొన్నాలని ఆయన సూచించారు. సమావేశంలో అప్పారావు పాలెం, బండారు పల్లి పంచాయతీ కార్యదర్శులు నరసింహాలు, ఆనంద్‌, రెండు గ్రామాల వాలంటీర్లు పాల్గొన్నారు.