వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : వలంటీర్ వ్యవస్థ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా ఉందని వైసిపి నాయకులు పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే మేకపాటి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనాడు దినపత్రికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వలంటీర్ వ్యవస్థపై విషపు రాతలు రాస్తోందన్నారు. వలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు చేరుతున్నాయని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చెందాలంటే సబ్సిడీ రుణాలు లబ్ధిదారులకు చెందాలంటే జన్మభూమి కమిటీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదన్నారు. అటువంటి వ్యవస్థ లేకుండా నిష్పక్షపాతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే ఓర్వలేనివిషపు కథనాలను రాస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ సర్దార్, డాక్టర్ కెవి శ్రావణ్ కుమార్, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, జిల్లా ఎస్‌సిసెల్ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, నాయకులు నోటి వినరుకుమార్‌రెడ్డి, ఇండోర్ వెంకటరమణారెడ్డి, షేక్ అబ్దుల్‌కలాం, లెక్కల జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.










