Feb 22,2023 20:39

- పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి టౌన్‌ : పవిత్రమైన రంజాన్‌ పండుగకు ముస్లిం మైనార్టీలు నిర్వహించే ప్రార్థనలకు వజు ఖానా నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ముస్లిం మైనార్టీలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా ప్రాంగణంలోని ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో ఈద్గా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్‌ ఖాన్‌ పరువేక్షణలో జరుగుతున్న వజు ఖానా నిర్మాణం పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా ప్రాంగణంలో వాకింగ్‌ టాక్‌, పచ్చదనాన్ని పెంపొంచెందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ ఫయాజ్‌ బాషా,వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహ్మాన్‌ లతో పాటు వైకాపా మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.