స్థలాన్ని తనిఖీ చేస్తున్న ఆర్‌డిఒ రంగస్వామి
ప్రజాశక్తి-పీలేరు : మండలంలోని ఓ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి పరిశీలించారు. మండలంలోని మేళ్లచెరువు పంచాయితీ, కొత్తపల్లిలో వెంకట శివారాంరెడ్డి అనే వ్యక్తి రెండు ఇళ్లు నిర్మించుకుంటూ, అక్కడున్న బండి దారిని కూడా మోసేస్తూ అడ్డు గోడ నిర్మించడంతో గ్రామస్తులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డిఒ శనివారం ఆ స్థలాన్ని పరిశీలించారు. విచారణలో గ్రామస్తులు ఇచ్చిన నివేదికను ఆర్‌డిఒ కలెక్టరుకు సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ తనిఖీలో తహశీల్దార్ జి.రవి, ఆర్‌ఐ రాజశేఖర్, సర్వేయర్, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.










