Dec 13,2022 21:29

సమావేశంలో పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది

       కదిరి టౌన్‌ : ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా రీసర్వే నిర్వహించేలా రెవెన్యూ అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కదిరి పట్టణంలోని షాదిమహల్లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం-2020పై తహశీల్దార్లు, ఎంపిడిఒలు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఈఓఆర్డీలు, విఆర్‌ఒలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ భాగ్యలక్ష్మి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఎడి రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీసర్వేలో రెవెన్యూ అధికారులదే స్పష్టమైన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా పొరపాటు జరిగి భూ హక్కు పత్రాలు ఇవ్వడంలో లోకభూయిష్టంగా వ్యవహరిస్తే అధికారులు చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ నాటికి మొదటి విడతలో భూ హక్కు పత్రాలు రెండు వేల గ్రామాల్లో ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోకపోవడం వల్ల ఉన్నతాధికాలను బదిలీ చేయాల్సి వచ్చిందన్నారు. అధికారులు రీ సర్వే, భూహక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. రీసర్వేని సమర్థవంతంగా, విజయవంతంగా, ఎలాంటి తగాదాలకు ఆస్కారం లేకుండా ముగించాల్సిన అవసరం ఉందన్నారు. భూ యజమానికి ఎలాంటి వివాదాల్లేకుండా శాశ్వతంగా మనశ్శాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో భూహక్కు పత్రాల పంపిణీ ప్రక్రియను అమలు చేస్తున్నారు. 22ఏ, డాటెడ్‌ ల్యాండ్‌ విషయంలో భూ యజమానికి మనశ్శాంతిని అందించేలా రెవెన్యూ అధికారులు కషి చేయాలన్నారు. భూ యజమానులు చెప్పగలిగే రెవెన్యూ శాఖకు సార్థకత వచ్చినట్లు అన్నారు. అందువల్ల రీ సర్వే ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ మాట్లాడుతూ రీసర్వేపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రకాల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సకాలంలో రీసర్వే పూర్తిచేసేందుకు అధికారులు అందరూ కలిసికట్టుగా కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వేలో పలు రకాల అంశాలపై పెనుకొండ డిఐఒఎస్‌ చిట్టిబాబు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, తదితరులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో తిప్పాయ్య నాయక్‌, కదిరి ఆర్డీవో రాఘవేంద్రతో పాటు తహశీల్దార్లు, ఎంపిడిఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.