ప్రజాశక్తి -ఉలవపాడు : మాండుస్ తుపాన్ వల్ల మండలం కరేడు పరిధిలోని అలగాయపాలెం గ్రామంలో 103.05 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పొలంలో సర్వే నిర్వహించి వేరుశనగ పైరు వేసి నష్టపోయినటువంటి 102 రైతుల పేర్లను ప్రభుత్వానికి సమర్పించారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 80శాతం రాయితో, రాయితీలో విత్తన పంపిణీ చేయమని మండలంలోని అలగాయపాలెం గ్రామానికి 150 క్వింటాళ్ళు విత్తనాలువచ్చాయి. బుధవారం విత్తన పంపిణీ కార్యక్రమం అలగాయపాలెం ప్రజా గ్రామంలో గ్రామ మండల పరిషత్ అర్థ అధ్యక్షులు వాయల మస్తానమ్మ, చెవురి వెంకటేశ్వర్లు ,గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా జరిగింది. కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ముత్యాల శేషగిరి, మండల వ్యవసాయాధికారిణి బి. తిరుమలజ్యోతి, గ్రామ వ్యవసాయ సంచాలకులు వి. ఆర్. వంశీకష్ణ, గ్రామ రైతులు పాల్గొన్నారు.










